KTR: హైడ్రా బుల్డోజర్‌ పేదల ఇళ్లపైకే వెళ్తుంది.. పెద్దల ఇళ్లకు వెళ్లదు

KTR: హైడ్రా బుల్డోజర్‌ పేదల ఇళ్లపైకే వెళ్తుంది.. పెద్దల ఇళ్లకు వెళ్లదు
x
Highlights

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తీవ్రంగా విమర్శించారు.

KTR: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) తీవ్రంగా విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు.

"హైకోర్టు సెలవు రోజుల్లో కూల్చివేతలు వద్దని స్పష్టంగా చెప్పినా, ఆదివారం సెలవు రోజునే గాజులరామారంలో పేదల ఇళ్లు కూల్చివేశారు" అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ హైడ్రా బుల్డోజర్ కేవలం పేదల ఇళ్లపైకే వెళ్తుందని, పెద్దల ఇళ్లకు వెళ్లదని అన్నారు.

"BRS కార్యకర్త సర్దార్ ఇంటిని ప్రభుత్వం కూల్చివేసింది. ఆయనకు మళ్లీ ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాది" అని హామీ ఇచ్చారు.

ప్రధాని మోడీ H-1B వీసా గురించి మాట్లాడతారని ఆశించామని, కానీ ఆయన జీఎస్టీ పండగ గురించి చెప్పారని ఎద్దేవా చేశారు. గతంలో ప్రజల నుంచి జీఎస్టీ పేరుతో భారం మోపి, ఇప్పుడు పండగ చేసుకో అనడం హాస్యాస్పదమన్నారు. మోదీ గతంలో చెప్పినట్లు అందరికీ రూ.15 లక్షలు ఇస్తేనే నిజమైన పండగ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories