వరి కొనుగోళ్లపై టీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్..

KTR: ఢిల్లీలోని దగాకోరు.. గల్లీలోని సిల్లీ బీజీపీ నేతలు చెబుతున్న దానికి పొంతన లేదన్నారు మంత్రి కేటీఆర్.

Arun Chilukuri
Updated on: 2 April 2022 7:00 PM IST
KTR Slams Centre Over Paddy Procurement
X

వరి కొనుగోళ్లపై టీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్..

KTR: ఢిల్లీలోని దగాకోరు.. గల్లీలోని సిల్లీ బీజీపీ నేతలు చెబుతున్న దానికి పొంతన లేదన్నారు మంత్రి కేటీఆర్. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వరి కొనుగోళ్లపై తలో మాట మాట్లాడుతున్నారని సెటైర్స్ వేశారు. తమ ప్రభుత్వం ముందు నుంచీ కేంద్రంతో చర్చించినా ఫలితం లేకపోగా వరి వేయొద్దంటే దానినీ తప్పుబట్టిన బీజేపీ నేతలు.. చివరి గింజవరకు కొనిపిస్తామన్న మాటలను గుర్తు చేశారు. నాడు కొనిపిస్తామని చెప్పి నేడు తప్పించుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు.

రైతులను అయోమయానికి గురిచేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా ఈనెల 4న మండలకేంద్రాల్లో నిరసనలు, 6న హైవేలపై రాస్తారోఖోలు, 7న జిల్లా కేంద్రాల్లో నిరసనలు, 8న ప్రతిరైతు ఇంటిపై నల్లజెండాలు, 11న ఢిల్లీలో మంత్రులు, ఎమ్మెల్యేల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ మేరకు ఆయన ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రైతులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story