logo
తెలంగాణ

ట్వీట్టర్ వేదికగా కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్

KTR Slams Central Government
X

ట్వీట్టర్ వేదికగా కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్

Highlights

KTR Tweet: కేంద్రంలోని బీజేపీ నేతలు, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది.

KTR Tweet: కేంద్రంలోని బీజేపీ నేతలు, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. తెలంగాణకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని ఓవైపు రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తుంటే మరోవైపు తెలంగాణకు ఎంతో చేశామంటూ కేంద్రంలోని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. తాజాగా ట్వీటర్ ద్వారా కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఈడీ, ఐటీ, సీబీఐ దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు, వారి బంధువులు, సన్నిహితులపై గత ఏనిమిదేళ్లలో ఎన్ని సార్లు ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరిగాయని ప్రశ్నించారు. బీజేపీ నేతలందరూ సత్య హరిశ్చంద్రుడి బంధువులనుకుంటున్నారా అని ట్వీటర్ వేదికగా నిలదీశారు.


Web TitleKTR Slams Central Government
Next Story