KTR: కేసీఆర్‌కు మరోమారు సీఎం అవకాశమిస్తే మరింత పురోభివృద్ధి

KTR: తారానగర్, ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మబండలో కేటీఆర్‌ రోడ్‌ షో

Jyothi
Published on: 23 Nov 2023 7:42 AM IST
KTR Road Show at Taranagar, Allwyn Colony, Yellammabanda
X

KTR: కేసీఆర్‌కు మరోమారు సీఎం అవకాశమిస్తే మరింత పురోభివృద్ధి 

KTR: గత తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అలజడి లేకుండా.. అభివృద్ధే ధ్యేయంగా పనిచేయడం జరిగిందని అన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌కు మరోమారు ముఖ్యమంత్రి అవకాశమిస్తే.. రాష్ట్రం మరింతగా పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారానగర్, ఆల్విన్ కాలనీ, ఎల్లమ్మబండలో ఆయన రోడ్‌ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరెకపూడి గాంధీని మరోసారి గెలిపించాలని కేటీఆర్ కోరారు. కేసీఆర్‌ను ఓడించేందుకు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు దిగుతున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు మంత్రి కేటీఆర్.

Jyothi

Jyothi

Next Story