కష్టకాలంలో పెద్దన్నలా అండగా కేటీఆర్!

కష్టకాలంలో పెద్దన్నలా అండగా కేటీఆర్!
x
Highlights

కరోనా కాలంలో కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా వందలాది మంది అవసరాలను తీరుస్తూ పెద్దన్న గా నిలుస్తున్నారు....

కరోనా కాలంలో కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా వందలాది మంది అవసరాలను తీరుస్తూ పెద్దన్న గా నిలుస్తున్నారు. అత్యవసరాల నిమిత్తం ప్రయాణం చేసేందుకు అనుమతులిప్పించాల్సింగా కొందరు, తన చంటిబిడ్డకు పాల ప్యాకేటు పంపాలని ఓ తండ్రి, తెలంగాణలో చిక్కుకున్న తమిళ కార్మికులకు సహయం అందించాలని పొరుగు రాష్టాల సీఎంలు ఇలా ఎన్నో విజ్నప్తులు వచ్చి పడుతుంటాయి. అర్దరాత్రి అపరాత్రి అని లేకుండా టీం కేటీఆర్ యుద్ద ప్రాతిపదికనా వారికి ఆపన్న హస్తం అందచేస్తూ ఆదుకుంటుంది. ఒక్క ట్విట్ చేస్తే చాలు సహయం అందుతుందన్న నమ్మకం ప్రజల్లో కలుగుతోంది.

లాక్ డౌన్ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి తెలంగాణ మంత్రి కేటీఆర్ అండగా నిలుస్తున్నారు. తన సాయం కోరుతూ ట్వీట్ చేసే వారికి వెంటనే సాయం అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం న్యూజిలాండ్ నుంచి ఓ వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. విజయవాడలో ఉండే తన తల్లికి హైదరాబాద్ లో బైపాస్ సర్జరీ చేయవలసి ఉందని, ఆమెకు ఎన్ వోసీ ఇప్పించాలని కోరారు. బ్రదర్ డోంట్ వర్రీ అంటూ భరోసా ఇచ్చిన కేటీఆర్ తన టీమ్ తో కూడిన KTRoffice కు ట్వీట్ ను టాగ్ చేసారు. వెంటనే విజయవాడ మహిళకు హైదరాబాద్ కు ప్రయాణం సాగించేందుకు ఎన్ వోసీ లభించింది.

తెలంగాణలోని ఓ ప్రాంతం నుంచి ఓ గర్భిణి కేటీఆర్ కు ట్వీట్ చేసింది. తాను హెల్త్ చెకప్ చేసుకోవాలని, లాక్ డౌన్ కారణంగా రాకపోకలు సాగించే వీలు లేకపోవడంతో సాయం చేయాలని కోరింది. వెంటనే స్పందించిన కేటీఆర్ బాధితురాలికి వైద్య పరీక్షలు అందేలా చూశారు. బోరబండకు చెందిన ఓ వ్యక్తి తన చిన్నారికి పాలు తాగించాల్సి ఉందని, లాక్ డౌన్ తో షాపులు బంద్ ఉండడంతో పాలు లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ కు కేటీఆర్ సమాచారం అందించారు. వెంటనే చిన్నారి తండ్రికి పాల ప్యాకెట్, బ్రెడ్ అందింది.

సామాన్యు లే కాదు ఇతర రాష్టాల నేతలు కూడా సహాయం కోరుతూ కేటీఆర్ కు ట్వీట్ చేస్తున్నారు. నిజమాబాద్ లో చిక్కుకున్న తమిళనాడుకు చెందిన చిరు వ్యాపారులను ఆదుకోవాలని డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన ట్విట్ కు క్షణాల్లోనే కేటీఆర్ ఆఫీస్ స్పందించిది. బాధితులకు నిత్యావసర సరుకులు, నగథును అందజేసింది.

కరోనా భయంతో ఈశాన్య ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను విదేశీయులుగా భావించి సూపర్‌మార్కెట్‌లోకి అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ ట్విట్టర్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాత్యహంకారం పట్ల కఠినంగా వ్యవహారించాలని పోలీసులను ఆదేశించారు. ఈశాన్య ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు సరుకులు అందజేసి, సూపర్ మార్కెట్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వారణాసిలో చిక్కుకున్న తెలంగాణ వాసులను తిరిగి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని ట్విట్టర్ వేదికగానే రాష్ట్ర పోలీసు చీఫ్‌ను కేసీఆర్ అభ్యర్థించారు. కవలలకు జన్మనిచ్చిన తరువాత కింద పడిన నిజామాబాద్‌ పేద మహిళ కు మెదడులో రక్తం గడ్డకట్టింది. ఆపరేషన్ కోసం 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని సాయం చేయాలని ఆమె కేటీఆర్ కు ట్వీట్ చేసింది. బాధితురాలి దుస్థితిపై విచారం వ్యక్తం చేసిన కేటీఆర్ సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

సోషల్ మీడియాలోనూ కేటీఆర్ చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ట్విట్టర్ లో వినతులు రాకున్నాకష్టాల్లో ఉన్నవారి ఇబ్బందులను తీర్చుతున్నారు. న్యూస్ పేపర్లలో వచ్చిన అంశాలపై తన టీం కు తగిన సూచనలు చేస్తారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారుల వార్తను పత్రికల్లో చూసి చలించిన కేటీఆర్ , వారిని ఆదుకోవాలని సిద్దిపేట కలెక్టర్ ను ట్విట్టర్ లో కోరారు. వెంటనే బాధిత చిన్నారులకు ప్రభుత్వ హాస్టల్ లో చేర్పించారు అధికారులు.

గత మార్చి లో లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి వందలాది మందికి కేటీఆర్ సహయ పడుతున్నారు. అత్యవసరాల విషయాలపై కేటీఆర్ కు రోజూ డజన్ల సంఖ్యలో ట్విట్లు చేస్తూనే ఉన్నారు. ఆరోగ్య సంరక్షణతో పాటు కుటుంబంలో మరణం విషయాలు కూడా వున్నాయి. ఆపద కాలంలో ఆదుకోవడానికి డయల్ 100, 104, 108 తో పాటు వివిధ హెల్ప్‌లైన్‌లు ఉన్నాయి. అయినా కేటీఆర్ కు ట్వీట్ చేస్తే తప్పనిసరిగా సహాయం అందుతుందన్న నమ్మకం జనంలో పాతుకుపోయింది. దీంతో ఆయనకు ట్వీట్ లు చేస్తున్నారు.

ట్విట్టర్ లో KTRTRS అకౌంట్ కు 2.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. టెక్కీలు, విద్యార్థులలో విశేష ప్రాచుర్యం పొందిన కేటీఆర్ సరికొత్త ఆవిష్కరణాలు చేయాలని యువకులను ఎల్లప్పుడు ప్రోత్సహిస్తు వుంటారు. కరోనాను ఎదుర్కొవటానికి యువత వినూత్న ఆలోచనలు లేదా డిజైన్ల చేయాలని ట్వీట్లు చేస్తున్నారు. తన ట్విట్టర్ లో వచ్చిన విజ్నప్తులను ఎప్పటికప్పడూ పరిష్కరిస్తూ కరోనా కష్టకాలంలో మంత్రి కేటీఆర్ హెల్పింగ్ హ్యాండ్ గా నిలుస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories