KTR: సుఖేష్ ఎవ‌రో తెలియ‌దు.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటా

KTR: గవర్నర్‌ తమిళిసైకి సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖపై స్పందించిన కేటీఆర్

Jyothi
Updated on: 14 July 2023 9:45 PM IST
KTR Responded to Sukesh Chandrasekhar Letter to Governor Tamilisai
X

KTR: సుఖేష్ ఎవ‌రో తెలియ‌దు.. న్యాయపరంగా చర్యలు తీసుకుంటా

KTR: గవర్నర్‌ తమిళిసైకి సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈడీకి ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని... సాక్షాలను ఇవ్వాలని బెదిరిస్తున్నట్లు గవర్నర్ తమిళి సైకి సుఖేష్ లేఖ రాశాడు. సుఖేష్ రాసిన ఈ లేఖపై కేటీఆర్ ట్వీట్ చేశారు. సుఖేష్ ఎవరో తనకు తెలియదన్నారు మంత్రి కేటీఆర్. సుఖేష్ చంద్రశేఖర్‌ ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. సుఖేష్ అనే వ్యక్తి గురించి తానెప్పుడూ వినలేదన్నారు. సుఖేష్ వ్యాఖ్యలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని కేటీఆర్ పేర్కొన్నారు.


Jyothi

Jyothi

Next Story