కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

X
Highlights
కరోనాతో ఇబ్బందిపడుతున్న కార్మికుల కోసం మస్కట్ నుంచి హైదరాబాద్‌కు విమానాన్ని నడపాల్సిందిగా కేంద్ర...
Arun Chilukuri6 Jun 2020 5:45 AM GMT
కరోనాతో ఇబ్బందిపడుతున్న కార్మికుల కోసం మస్కట్ నుంచి హైదరాబాద్‌కు విమానాన్ని నడపాల్సిందిగా కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాలు, జీతాలు లేక అక్కడ భారతీయులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ట్విటర్‌లో పేర్కొన్నారు. మస్కట్‌లో ఉన్న తెలంగాణకు చెందిన పలువురు వ్యక్తులు లాక్‌డౌన్ కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. భారత్‌కు వద్దామనుకుంటే హైదరాబాద్‌కు విమానాలు లేక కార్మికులు అవస్థలుపడుతున్నారని పేర్కొన్నాడు. స్పందించిన కేటీఆర్ కేంద్రానికి ఈ మేరకు విజ్ఞప్తిని చేశారు.
Web Titlektr request Union Minister Hardeep Singh Puri to arrange flight from Muscat to Hyderabad
Next Story