KTR: ప్రతిపక్ష పాత్రలో.. ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా పనిచేస్తాం

KTR: పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ నిరాశపడొద్దని సూచించారు.

Shekhar G
Published on: 3 Dec 2023 7:21 PM IST
KTR Press Meet After Election Results
X

KTR: ప్రతిపక్ష పాత్రలో.. ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా పనిచేస్తాం

KTR: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రజా తీర్పును శిరసావహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు పంపారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రజా తీర్పును తాము గౌరవం ఇస్తామన్నారు. రాజకీయ ప్రస్థానంలో తాము ఎన్నో ఎత్తుపల్లాలు చూశామన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి ప్రభుత్వాన్ని నడపాలని కోరుకుంటున్నామని తెలిపారు.



Shekhar G

Shekhar G

Next Story