KTR: పురుగుల అన్నం తిని అంబులెన్స్ లో విద్యార్థులు.. పంచభక్ష పరమాన్నాలు తిని హెలికాఫ్టర్ లో రేవంత్ షికార్లు..

KTR: ఎక్స్ వేదికగా సీఎం రేవంత్(CM Revanth Reddy) పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 Nov 2024 11:24 AM IST
KTR Post in X over Gurukula Students Problems
X

KTR: పురుగుల అన్నం తిని అంబులెన్స్ లో విద్యార్థులు..

KTR: ఎక్స్ వేదికగా సీఎం రేవంత్(CM Revanth Reddy) పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల భవిష్యత్ దారుణంగా ఉందన్నారు. గురుకులాల విద్యార్థులు పట్టెడు అన్నం కోసం పోరాడుతుంటే, సీఎం రేవంత్ మూసీ ముడుపుల కోసం ఆరాటపడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల కంచాల్లోకి పరుగులు, పాములు వస్తున్నాయన్నారు.

కనీస వసతులులేక, సరిపడా మరుగుదొడ్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పురుగుల అన్నం తిని విద్యార్థులు అంబులెన్స్ లో వెళుతుంటే, రేవంత్ మాత్రం పంచభక్ష పరమాన్నాలు తిని హెలికాఫ్టర్ లో తిరుగుతున్నారని విమర్శించారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story