కేటీఆర్ బహిరంగ లేఖ: భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను విడుదల చేసిన..

కేటీఆర్ బహిరంగ లేఖ: భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను విడుదల చేసిన..
x

కేటీఆర్ బహిరంగ లేఖ(Image credit:the Hans India)

Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విపక్షాలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పొందుపరిచారు. ఉద్యోగాలపై విపక్షాలు...

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విపక్షాలకు బహిరంగ లేఖ రాశారు. లేఖలో ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పొందుపరిచారు. ఉద్యోగాలపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు నిజాలను దాచేస్తున్నాయన్న కేటీఆర్ 2014 నుంచి భర్తీ చేసిన ఉద్యోగాలపై తాను ప్రకటన చేశానని స్పష్టం చేశారు. 2014-2020 మధ్య లక్షా 32,899 ఉద్యోగాలు భర్తీ చేశామన్న మంత్రి ఎవరికైనా అనుమానాలుంటే ఆ శాఖతో దృవీకరించుకోవాలన్నారు.

శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు..

1. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - 30,594

2. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ -31,972

3. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు- 3,623

4. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ - హైదరాబాద్ - 179

5. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ - హైదరాబాద్- 80

6. డైరెక్టర్, మైనారిటీస్ వెల్ఫేర్ - 66

7. జూనియర్ పంచాయతీ సెక్రెటరీస్ - 9,355

8. డిపార్ట్‌మెంట్ అఫ్ ఆయుష్ - 171

9. టీఎస్ జెన్ కో- 856

10. టీఎస్ ఎన్పీడీసీఎల్ - 164

11. టీఎస్ ఎస్పీడీసీఎల్ - 201

12. టీఎస్ ట్రాన్స్ కో - 206

13. టీఎస్-ఆర్‌టీసీ - 4,768

14. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్-12,500

15. జెన్‌కో, ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్, ఎస్ పి డి సి ఎల్ - 6,648

16. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ - 22,637

17. హైదరాబాద్ జలమండలి- 807

18. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ - 243

19. డీసీసీబీలు - 1,571

20. భర్తీ ప్రక్రియ తుదిదశలో ఉన్న ఉద్యోగాలు - 6,258

మొత్తం ఉద్యోగాల సంఖ్య - 1,32,899

Show Full Article
Print Article
More On
Next Story
More Stories