KTR: హుజూరాబాద్​పై టీఆర్‌ఎస్‌ ఫోకస్

* నేడు ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్‌ సమావేశం * పలు అంశాలపై నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం

Sandeep Reddy
Published on: 27 July 2021 6:38 AM IST
KTR‌ Meeting With TRS General Secretaries About Huzurabad ByPoll Today 27th July 2021
X

కేటీఆర్‌ సమావేశం (ఫైల్ ఫోటో)

KTR: టీఆర్ఎస్‌ ప్రధాన కార్యదర్శులతో మంత్రి కేటీఆర్‌ ఇవాళ సమావేశం కానున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికపై వ్యూహరచన, తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, విపక్షాల తీరుపై స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్​ ఉపఎన్నికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. గెలుపే లక్ష్యంగా సర్వశక్తులను సమీకరించి వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందిస్తోంది. ఇప్పటికే మంత్రులు, ముఖ్యనేతలు, నియోజకవర్గంలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, స్థానికులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శులు, నేతలకు ఉపఎన్నిక బాధ్యతలు అప్పగించనున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story