KTR: ఇప్పటిదాకా చూసింది ట్రైలరే.. సినిమా ముందుంది

KTR: ఇది తాము అనుకున్న ఆశయం కాదు

Shekhar G
Published on: 8 Nov 2023 6:18 PM IST
KTR Meeting With Industrialists
X

KTR: ఇప్పటిదాకా చూసింది ట్రైలరే.. సినిమా ముందుంది

KTR: హైదరాబాద్ లో పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గతంలో 14 రోజులకు ఒకసారి కాలనీల్లో తాగు నీరు వచ్చేదని.. ప్రస్తుతం రోజు విడిచి రోజు వస్తున్నాయన్నారు. ఇది అభివృద్ధి కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అయితే.. అది తమ ఆశయం కాదన్నారు. ప్రతిరోజు 24 గంటలు తాగు నీళ్లు అందివ్వాలన్నదే తమ అంతిమ లక్ష్యమన్నారు. ఇది తన వ్యక్తిగత డ్రీమ్ అని... తప్పకుండా చేసి తీరుతామని.. ప్రజలు చూసి తీరుతారని కేటీఆర్ కుండ బద్దలుకొట్టారు. ఇప్పటిదాకా చూసింది ట్రైలర్ అని.. ఇంకా సినిమా ముందుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story