గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష

Arun Chilukuri
Published on: 12 Nov 2020 12:21 PM IST
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష
X

గ్రేటర్‌ హైదరాబాద్‌‌లో పార్టీ పరిస్థితులపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజూ ఐదుగురు ఎమ్మెల్యేలతో సమీక్ష జరుపుతున్న కేటీఆర్‌ డివిజన్ల వారీగా పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించటంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

అటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణపై ప్రధాన పార్టీల నేతలతో ఎన్నికల కమిషనర్‌ సమావేశం కొనసాగుతోంది. సమావేశానికి 11 గుర్తింపు పొందిన పార్టీలు హాజరవగా ఒక్కొక్క పార్టీ నేతలతో విడివిడిగా భేటీ అవుతున్నారు ఎలక్షన్ కమిషనర్‌ పార్థసారధి. ప్రతీ పార్టీకి 15 నిమిషాల సమయం కేటాయించిన ఈసీ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు స్వీకరిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story