మోదీకి మేం భయపడం .. సోషల్ మీడియా కార్యకర్తల భేటీలో కేటీఆర్ వ్యాఖ్యలు

మోదీకి మేం భయపడం .. సోషల్ మీడియా కార్యకర్తల భేటీలో కేటీఆర్ వ్యాఖ్యలు
x
కేటీఆర్ ఫైల్ ఫోటో
Highlights

మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సూచించారు. టీఆర్ఎస్...

మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సూచించారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సామాజిక మాధ్యమాల ద్వారా మరింత విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రదాని మోదీకి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. మున్సిపాల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున అభ్యర్థులు లేరని.. అలాంటి పార్టీకి ఎందుకు భయపడతామని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ హావా చూస్తారని కేటీఆర్ చెప్పారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు తెరతీస్తారని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్‌కు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారని అన్నారు. సోషల్ మీడియాలను వాడుకోవాలని విసృతంగా వారికి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వ అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేయాలని చెప్పారు. టీవీల్లో వచ్చే వార్తలను ప్రజలను విస్వవించే పరిస్థితుల్లో లేరని కేటీఆర్ పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సామాజిక మాధ్యమాలు వాడతారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా దినేష్ చౌదరి, మన్నె క్రిశాంక్‌, పాటిమీది జగన్, సతీష్ రెడ్డిని కేటీఆర్ నియమించారు. వినూత్నరీతిలో ప్రచారం చేయాలని ఆయన సూచించారు. సంక్రాంతి పండుగలోనూ, గాలిపటాల్లో కారు గుర్తు ఉండేలా చూడాలని కేటీఆర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో మున్సిపాలిటీల పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories