KTR: ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కి కేటీఆర్ లేఖ

KTR: సీఎస్, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని స్పీకర్‌కి కేటీఆర్ విజ్ఞప్తి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 July 2024 7:01 PM IST
KTR letter to Gaddam Prasad on protocol violation speakers
X

KTR: ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కి కేటీఆర్ లేఖ

KTR: ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని పేర్కొన్నారు. అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలను అప్పగిస్తున్నారని ఆరోపించారు. శాసనసభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ కాలరాస్తోందని ఆక్షేపించారు. ఎమ్మెల్యేల హక్కులు, ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలని కేటీఆర్ కోరారు. ఆ మేరకు రాష్ట్ర సీఎస్‌తో పాటు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామన్నారు కేటీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story