కారెక్కనున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య? కాసేపట్లో పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్..

Ponnala Lakshmaiah: హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన పొన్నాల లక్ష్మయ్య త్వరలోనే కారెక్కనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Arun Chilukuri
Published on: 14 Oct 2023 1:23 PM IST
KTR Invite Ponnala Lakshmaiah to Join BRS
X

కారెక్కనున్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య? కాసేపట్లో పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్..

Ponnala Lakshmaiah: హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన పొన్నాల లక్ష్మయ్య త్వరలోనే కారెక్కనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగానే కాసేపట్లో మాజీ మంత్రి పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్‌లోకి పొన్నాలను కేటీఆర్ ఆహ్వానిస్తారని తెలుస్తోంది. పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్ పాటు పలువురు గులాబీ పార్టీ సీనియర్ నేతలు కూడా వెళ్లారు.

ఇక కాంగ్రెస్‌లోని అసంతృప్త నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాలం వేయబోతున్నారా అనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. మరి పొన్నాలతో పాటు కారెక్కేది ఇంకెందరు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌లోని బీసీ నేతలతో బీఆర్ఎస్ సీనియర్లు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హస్తం అభ్యర్థుల ప్రకటన తర్వాత మారే సీన్ ఏంటనేది ఇంట్రెస్టింగ్‌ మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story