KTR: బీఆర్‌ఎస్‌ నేతల వలస రాజకీయాలపై కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్

KTR: అసాధ్యం అనుకున్న తెలంగాణను కేసీఆర్‌ సాధించారు

Shashank Gullapelli
Published on: 29 March 2024 10:43 AM IST
KTR Interesting Tweet On The Migration Of BRS Leaders
X

KTR: బీఆర్‌ఎస్‌ నేతల వలస రాజకీయాలపై కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్

KTR: బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కేసీఆర్..! ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్..!! అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు..! ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌ గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు..! నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం..! అంటూ పిలుపునిచ్చారు కేటీఆర్. అయితే.. ఇప్పుడు కేటీఆర్‌ చేసిన ట్వీట్‌.. నెట్టింట వైరల్‌గా మారింది.


Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story