ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఢిల్లీకి కేటీఆర్, హరీష్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 23 Aug 2024 11:09 AM IST
KTR, Harish Rao To Meet Kavitha In Delhi
X

ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత..ఢిల్లీకి కేటీఆర్,హరీష్

Kalvakuntla Kavitha Health Condition Updates: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు గురువారం ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఆమె కొంతకాలంగా గైనిక్‌ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు ఇటీవల వైరల్‌ జ్వరం బారినపడ్డారు.

జూలై 16న తొలిసారిగా కవితను ఢిల్లీలోని దీన్‌ దయాళ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ఇవాళ కేటీఆర్, హరీష్‌‌రావు ఢిల్లీ వెళ్లనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story