KTR: సుంకిశాలకు పునరుజ్జీవనం తెచ్చింది బీఆర్ఎస్

సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే సుంకిశాల నుంచే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏం చెప్పదలచుకున్నారో స్పష్టం చేయాలన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 Aug 2024 1:20 PM IST
KTR Demands Judicial Inquiry On Sunkishala Project Wall Collapse
X

KTR: సుంకిశాలకు పునరుజ్జీవనం తెచ్చింది బీఆర్ఎస్

KTR: సుంకిశాల ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌ నీటి అవసరాల కోసం గతంలో సుంకిశాల ప్రాజెక్టు మెుదలు పెట్టామని వివరించారు. సుంకిశాల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పునరుజ్జీవనం తీసుకువచ్చిందన్నారు. త్వరత్వరగా పనులు చేయాలనే హడావిడిలో గేట్లు సరిగా పెట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు.

మేడిగడ్డపై స్పందించిన ప్రభుత్వం సుంకిశాల గోడ కూలితే ఎందుకు దాచిందని ప్రశ్నించారు. ఘటనపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే సుంకిశాల నుంచే విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏం చెప్పదలచుకున్నారో స్పష్టం చేయాలన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story