రేవంత్ పై కేటీఆర్ పరువు నష్టం దావా.. రిజెక్ట్ చేసిన సిటీ సివిల్ కోర్ట్

* సరైన ధృవ పత్రాలు సమర్పించలేదన్న కోర్ట్ * రేపు పూర్తి ఆధారాలతో మరో పిటిషన్ వేయనున్న కేటీఆర్ తరపు న్యాయవాది

Sandeep Reddy
Updated on: 20 Sept 2021 10:30 PM IST
KTR Defamation Case on Revanth Reddy in City Civil Court but Court Rejected Due to did not Submit Proper Credentials
X

రేవంత్ - కేటీఆర్(ఫోటో: ది హన్స్ ఇండియా)

Telangana: సెలబ్రిటీస్ డ్రగ్స్ వ్యవహారం తిరిగి తిరిగి రాజకీయ పార్టీల మధ్య అస్త్రంగా మారింది. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలను కేటీఆర్ కాపాడుతున్నారని ఆరోపణలు గుప్పించిన పీసీసీ చీఫ్ రేవంత్ కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.. తాను పరీక్షలకు సిద్ధమని రాహుల్ కూడా పరీక్షలకు వస్తారా అని సవాల్ విసిరారు.. దానికి కౌంటర్ గా రేవంత్ తాను సవాల్ స్వీకరిస్తానని, ఇద్దరూ పరీక్షలు చేయించకుందామనీ అన్నారు.

రేవంత్ ఇష్టానుసారం, అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని మండి పడిన కేటీఆర్ ఆయనపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధపడ్డారు. తనపై అనవసరమైన, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సిటీ సివిల్ కోర్టులో ఇవాళ పరువు నష్టం దావా వేశారు. అయితే ఆయన సరైన ధృవపత్రాలు లేవన్న కారణంగా సిటీ సివిల్ కోర్టు తిరస్కరించింది. అయితే రేపు సరైన ధృవ పత్రాలతో మళ్లీ దాఖలు చేయనున్నట్లు కేటీఆర్ తరపు న్యాయవాది తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story