KTR: బండి సంజయ్‌కి ఎక్స్‌లో కేటీఆర్ కౌంటర్

KTR: ఇది మీ స్థానానికి తగినది కాదు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 27 Aug 2024 4:15 PM IST
KTR Counter To Bandi Sanjay On X
X

KTR: బండి సంజయ్‌కి ఎక్స్‌లో కేటీఆర్ కౌంటర్

KTR: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి కేటీఆర్ కౌంటరిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి..సుప్రీం తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది మీ స్థానానికి తగినది కాదని సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా...పరిగణనలోకి తీసుకోవాలని ఎక్స్‌లో కేటీఆర్ కోరారు. కవితకు బెయిల్ రావడంపై కాంగ్రెస్ పార్టీకి, న్యాయవాదులకు అభినందనలు అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ సెటైర్లు వేశారు. మీ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయంటూ బీఆర్ఎస్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. దీంతో బండి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ట్వీ్ట్ చేశారు కేటీఆర్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story