TRS Plenary: కేటీఆర్ అధ్యక్షతన పార్టీ ప్లీనరీ సన్నాహక సమావేశాలు

*నియోజకవర్గాల వారీగా నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ *దుబ్బాక, సిరిసిల్ల, సంగారెడ్డి నియోజకవర్గాల నేతలతో మీటింగ్

Shilpa
Updated on: 18 Oct 2021 2:08 PM IST
KTR Conducting TRS Party Plenary Preparatory Meetings in Telangana Bhavan
X

కేటీఆర్ అధ్యక్షతన పార్టీ ప్లీనరీ సన్నాహక సమావేశాలు(ఫైల్ ఫోటో)

TRS Plenary: టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సన్నాహక సమావేశాలను ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తెలంగాణభవన్‌లో నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ అవుతున్నారు. ఇవాళ దుబ్బాక, సిరిసిల్ల, సంగారెడ్డి నియోజక వర్గాల నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. విజయ గర్జన్ సభకు భారీగా జనసమీకరణ చేయాలని టీఆర్ఎస్‌ నేతలను కేటీఆర్ ఆదేశించారు.

నియోజక వర్గాల్లో నాయకుల మధ్య గ్యాప్, కింది స్థాయి నాయకత్వ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆరా తీస్తున్నారు. ఇకపై అందరికీ అందుబాటులో ఉంటానని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ సమస్య వచ్చినా తనను నేరుగా వచ్చి కలవొచ్చని సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ పార్టీ కోసం హార్డ్ వర్క్ చేయాలని మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. వరంగల్ సభకు ప్రతి గ్రామం నుంచి తరలిరావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

Shilpa

Shilpa

Next Story