KTR: బీజేపీ ఆదేశాలతోనే అదానీతో కలిసి సీఎం రేవంత్ పనిచేస్తున్నారు

KTR: ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొ్ట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది

Shekhar G
Published on: 18 Jan 2024 1:56 PM IST
KTR Comments On Revanth Reddy And Congress
X

KTR: బీజేపీ ఆదేశాలతోనే అదానీతో కలిసి సీఎం రేవంత్ పనిచేస్తున్నారు

KTR: మహబూబ్‌నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిగరబడతారని హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తుచేయాలని కేటీఆర్ ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని అన్నారు. కాంగ్రెస్‌ ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ.. తెలంగాణలో మాత్రం ఎందుకు కలిసి పనిచేస్తుందో చెప్పాలన్నారు.

అధికారంలో లేనప్పుడు అదానీ.. దేశానికి శత్రువున్న కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అదే అదానీతో దోస్తీ చేస్తోందని ఆరోపించారు. బీజేపీ ఆదేశాలతోనే అదానీతో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే వారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి.. అనేక వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు కేటీఆర్. తాము గెలిచినప్పుడు పొంగిపోలేదని.. ఓటమికి కుంగిపోలేదని.. ఎప్పుడైనా తమ పార్టీ ప్రజల కోసం పనిచేస్తోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికే శ్వేత పత్రాల పేరుతో కాంగ్రెస్ నాటకాలు మొదలుపెట్టిందని ఆరోపించారు కేటీఆర్.

Shekhar G

Shekhar G

Next Story