KTR: రాహుల్‌ యాత్రపై KTR సెటైర్లు.. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆ పార్టీని వీడేందుకు..

KTR: మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్‌ రాహుల్‌ జోడోయాత్రపై పలు విమర్శలు చేశారు.

Arun Chilukuri
Updated on: 7 Oct 2022 5:45 PM IST
KTR Comments on Rahul Gandhis Bharat Jodo Yatra
X

KTR: రాహుల్‌ యాత్రపై KTR సెటైర్లు.. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆ పార్టీని వీడేందుకు..

KTR: మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్‌ రాహుల్‌ జోడోయాత్రపై పలు విమర్శలు చేశారు. రాహుల్‌ భారత్‌ జోడోయాత్ర కాదు.. కాంగ్రెస్‌ జోడోయాత్ర చేయాలని ఆయన అన్నారు. కేరళలో రాహుల్‌ యాత్ర చేస్తుంటే.. గోవాలో ఎమ్మెల్యేలు పక్క పార్టీలో చేరారని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు.

ఇక.. మునుగోడులో టీఆర్‌ఎస్‌దే గెలుపు అన్న మంత్రి కేటీఆర్ రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. తమను తెలంగాణలో కలపాలంటూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్‌ పెరుగుతోందని అన్నారు కేటీఆర్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story