KTR: బీజేపీ స్టీరింగ్ మోడీ చేతిలో లేదు....ఆదానీ చేతిలో ఉంది

KTR: MIM స్టీరింగ్ అసద్ చేతిలో ఉంది

Shekhar G
Published on: 2 Oct 2023 3:20 PM IST
KTR Comments On Modi
X

KTR: బీజేపీ స్టీరింగ్ మోడీ చేతిలో లేదు....ఆదానీ చేతిలో ఉంది

KTR: హైదరాబాద్‌ మలక్‌పేట్‌లో ఐటీ టవర్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యే బలాల, డిప్యూటీ మేయర్‌ శ్రీలత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్‌ అసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతిలో, మజ్లీస్‌ స్టీరింగ్‌ అసద్‌ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యనించారు. బీజేపీ స్టీరింగ్‌ మోడీ చేతిలో లేదు.. అదానీ చేతిలో ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణకు వచ్చిన మోడీ ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా జాతీయ హోదా ప్రకటించలేదన్నారు. బెంగళూరు కంటే ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఐటీ జాబ్స్‌ వస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మా స్టీరింగ్‌ కేటీఆర్‌ చేతిలో ఉందని ఎంపీ అసదుద్దీన్‌ చమత్కరించారు. ఓల్డ్ సిటీలో యువతకు ఉపాధి కల్పించాలనే తన కల నెరవేరబోతోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఐకానిక్ భవనం పాత నగరానికే తలమానికంగా మారుతుందని హర్షం వ్యక్త చేశారు.

Shekhar G

Shekhar G

Next Story