KTR: 60 రోజుల కాంగ్రెస్‌ పాలన అయోమయంగా ఉంది

KTR: ఫార్మాసిటీ, మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల.. రాష్ట్ర అభివృద్ధి దెబ్బతినే అవకాశం ఉంది

Shekhar G
Published on: 10 Feb 2024 5:42 PM IST
KTR Comments On Congress Government
X

KTR: 60 రోజుల కాంగ్రెస్‌ పాలన అయోమయంగా ఉంది

KTR: బడ్జెట్‌పై బీఆర్ఎస్‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. 60 రోజుల కాంగ్రెస్‌ పాలన అయోమయంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 420 హామీలకు కేవలం 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించిందని కేటీఆర్‌ విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ అభివృద్ధిని అడ్డుకుంటుందని కేటీఆర్‌ అన్నారు. ఫార్మాసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి దెబ్బతినే అవకాశం ఉందని కేటీఆర్‌ మండిపడ్డారు.

Shekhar G

Shekhar G

Next Story