KTR: బండి సంజయ్ ఏం చదువుకున్నారు.. ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుంది?

KTR: గ్రూప్‌-1 అభ్యర్థులను చర్చలకు పిలవకపోవడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Oct 2024 4:49 PM IST
KTR Comments On Bandi Sanjay Demand Over Repealing Go No 29
X

KTR: బండి సంజయ్ ఏం చదువుకున్నారు.. ఆయనకు పరీక్షల గురించి ఏం తెలుస్తుంది?

KTR: గ్రూప్‌-1 అభ్యర్థులను చర్చలకు పిలవకపోవడం దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభ్యర్థులను ప్రభుత్వం పశువుల్లా చూస్తోందన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం వరకు ఆగాల్సిందని అభిప్రాయపడ్డారు. రేవంత్‌, బండి సంజయ్‌ డ్రామాలాడుతున్నారని తెలిపారు.

బండి సంజయ్‌కి భద్రత ఇచ్చి రేవంత్‌ ర్యాలీ చేయించారని చెప్పారు. బండి సంజయ్‌ని చర్చలకు పిలిచినా లాభం ఉండదని అన్నారు. బండి సంజయ్‌ ఏం చదువుకున్నారని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రాలు లీక్‌ చేయడమే బండి సంజయ్‌కి తెలుసని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌కి పరీక్షల గురించి ఏం తెలుసన్నారు కేటీఆర్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story