KTR: ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్‌

KTR: నిరుద్యోగుల పట్ల మా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదు

Dhatripriya
Published on: 17 March 2023 6:45 PM IST
KTR Comments On Bandi Sanjay
X

KTR: ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్‌

KTR: TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్‌. ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి అవగాహన లేని మతిలేని నాయకుడు బండి సంజయ్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రభుత్వ శాఖ కాదని.. అది ఒక రాజ్యాంగ బద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అనే విషయంపై కూడా బండి సంజయ్‌కు కనీస అవగాహన లేదన్నారు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్న నేత బండి సంజయ్‌ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల పట్ల తమ నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు మంత్రి కేటీఆర్‌.

Dhatripriya

Dhatripriya

Next Story