కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన అవ్వ.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్‌..

KTR Clarifies on KCRs Health After a Elderly Woman Expressed Concern
x

కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీసిన అవ్వ.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్‌..

Highlights

KTR: సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై గత కొంతకాలంగా కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

KTR: సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై గత కొంతకాలంగా కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించిందని అప్పట్లో కొందరు ప్రచారం చేశారు. నేషనల్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మంత్రి కేటీఆర్‌.. కేసీఆర్‌ ఆరోగ్యం కాస్త మందగించిందని చెప్పారు. గతంతో పోలిస్తే.. కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్‌ మీడియా ఎదుటకు కూడా రావడం లేదు. దీంతో.. గులాబీ బాస్‌ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

అయితే.. ఇప్పుడు తాజాగా కేసీఆర్‌ ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్‌ ఓ క్లారిటీ ఇచ్చారు. భూపాలపల్లిలో మంత్రి కేటీఆర్‌ ఓ సభలో ప్రసంగిస్తూ.. ఓ అవ్వ కేటీఆర్‌ దగ్గరకు వచ్చి.. బాపు ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీసిందని చెప్పారు. కేసీఆర్‌ జబర్దస్త్‌గా ఉన్నాడంటూ అవ్వకు చెప్పినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే బయటకు వస్తారని సభలో చెప్పారు మంత్రి కేటీఆర్. దీంతో కేసీఆర్‌ ఆరోగ్యంపై ఒక స్పష్టత వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories