మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు: మంత్రి కేటీఆర్

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు: మంత్రి కేటీఆర్
x
KTR and Kavitha (file photo)
Highlights

టీఆర్ఎస్ మహిళా నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ రోజు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు.

టీఆర్ఎస్ మహిళా నేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ రోజు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ సోదరి కవితకు పుట్టిన రోజు సుభాకాంక్షలు తెలిపారు. "హ్యాపీ బర్త్ డే పప్" అంటూ కవిత చిన్నప్పటి ముద్దుపేరుతో ట్విట్ చేసారు. "నీ జీవితంలో సంతోషం నిండాలని, మంచి ఆరోగ్యం, సుఖశాంతులు ఉండేలా దీవెనలు లభించాలని కోరుకుంటున్నా" అంటూ సుభాకాంక్షలు తెలిపారు.

కాగా తెలంగాణ కార్యర్తలు అసెంబ్లీలోని డిప్యూటీ స్పీకర్‌ ఛాంబర్‌లో టి. పద్మారావు గౌడ్‌ సమక్షంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కవిత తనదైన శైలిలో పాత్ర పోషించారని తెలిపారు. బతుకమ్మ ప్రత్యేకతను, బోనాల విశిష్టతను ప్రపంచానికి తెలిసేలా కవిత కృషి అన్నారు. ఈ వేడుకల్లో మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories