కేంద్రంపై మరో యుద్ధానికి సిద్ధమైన తెలంగాణ సర్కారు

KTR Attacks the BJP led Union Govt to Privatize Singareni
x

కేంద్రంపై మరో యుద్ధానికి సిద్ధమైన తెలంగాణ సర్కారు

Highlights

KTR Attacks: కేంద్ర సర్కారుతో తెలంగాణ సర్కారు మరో యుద్ధానికి సిద్ధమవుతోంది.

KTR Attacks: కేంద్ర సర్కారుతో తెలంగాణ సర్కారు మరో యుద్ధానికి సిద్ధమవుతోంది. బడ్జెట్ లో తెలంగాణకు ఏమీ చేయలేకపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీపై తీవ్రంగా విరుచుకపడగా తాజాగా మంత్రి కేటీఆర్ సింగరేణి ఇష్యూతో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ఉన్న నల్ల బంగారాన్ని మరింత వెలికి తీసేందుకు కొత్త గనులు కేటాయించాల్సింది పోయి వేలంలో అమ్మకానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసినట్లు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో కేంద్రంపై మరో యుద్ధానికి కేసీఆర్ సర్కారు సిద్ధమవుతున్నట్టుగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories