
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ఎంతో మంది కళను నిజం చేసారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దినదినాభివృద్ది చేస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ఎంతో మంది కళను నిజం చేసారు కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి దినదినాభివృద్ది చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజల అబిమానాన్ని పొందుతున్నారు. ఎంతో మంది అభిమానాన్ని పొందుతున్న కేసీఆర్ ఈ రోజు 65 వసంతాలు పూర్తి చేసుకుని 66వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు.
దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా సందడి నెలకొంది. సోషల్ మీడియాలో, వెబ్ సైట్లలో, ఎక్కడ చూసినా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రా అనే తేడా లేకుండా ప్రముఖులంతా కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. హ్యాపీ బర్త్ డే కేసీఆర్, కేసీఆర్ బర్త్‌డే హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు. అంతే కాదు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఆయన కు ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రంలో హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
To the most Versatile, Courageous, Compassionate, Charismatic & Dynamic man that I know; The man who I am proud to call my Father 😊
— KTR (@KTRTRS) February 17, 2020
May you live long & may you continue to inspire us all with your vision & commitment
తల్లిని కన్న తనయుడికి
జన్మదిన శుభాకాంక్షలు#HappyBirthdayKCR pic.twitter.com/YP8whlAqQd
ధైర్యవంతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కరుణామయుడు, ప్రజాకర్షణ కలిగిన క్రియాశీల వ్యక్తి ; నేను నాన్న అని గర్వంగా పిలిచే వ్యక్తి మీరు చిరకాలం జీవించాలని, నిబద్ధతతో మాలో ఇలాగే స్ఫూర్తిని నింపుతుండాలని కోరుకుంటున్న. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ మీ స్వప్నం
— Harish Rao Thanneeru (@trsharish) February 17, 2020
ఈ రాష్ట్రం మీ త్యాగఫలం
ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శణం
ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష
తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు#HappyBirthdayKCR pic.twitter.com/BxbeTs4XLT
ఇక పోతే రాష్ట్ర మంత్రి హరీష్ రావు కూడా తన మేనమామ కేసీఆర్ కూ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. తెలంగాణ మీ స్వప్నం, ఈ రాష్ట్రం మీ త్యాగఫలం, ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శణం, ఈ నేలకు మీరే శ్రీరామ రక్షతెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసారు.
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కేసీఆర్ చిత్రాల ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, మహిళలు, పిల్లల అభివృద్ధి శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ గ్యాలరీలో 50 చిత్రాలు ప్రదర్శనలో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి క్యూరెటర్‌గా ప్రముఖ ఆర్టిస్ట్ రమణారెడ్డి వ్యవహారించారు. కాగా ఈ చిత్రాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేసీఆర్ చిత్ర పటాలను ప్రదర్శనలో ఉంచి కేక్‌ను కూడా కట్ చేశారు. ఈ గ్యాలరీ ఈ నెల 23వ తేదీ వరకు ఉంటుందన్నాని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మి, పలువురు చిత్ర కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
Each of my family members planted a sapling wishing Sri KCR Garu a long, healthy, happy life filled with peace and love😊
— KTR (@KTRTRS) February 17, 2019
Many wishes to a rare leader & a fighter who personifies courage, commitment & grit. Proud that he is also my father 🙏#EachOnePlantOne#HappyBirthdayKCR pic.twitter.com/rsgZID0gst
Happy Birthday Dad 😊
— KTR (@KTRTRS) February 16, 2018
Wish you many many years of good Health & loads of Happiness pic.twitter.com/6tM9zCHzUq
కేసీఆర్ సన్నిహితుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి బర్త్ డే విషెస్ తెలిపారు. ''తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా'' అని జగన్ ట్వీట్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా.@TelanganaCMO
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 17, 2020
ప్రధాని మోదీ, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మేఘాలయ సీఎం క్రొనాడ్ సంగ్మా తదితరులు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ.. ఆయన చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
Greetings to Telangana CM KCR Garu on his birthday. Praying for his long and healthy life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2020
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి @TelanganaCMO
— N Chandrababu Naidu (@ncbn) February 17, 2020
కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




