KRMB Meeting: జలసౌధలో ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం

KRMB Meeting Ended in Jalasoudha
x

జలసౌధలో ముగిసిన కేఆర్ఎంబీ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

KRMB Meeting: కీలక ప్రకటన చేసిన కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు

KRMB Meeting: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు సమావేశం జరిగింది. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్‌లు వాటిపై ఉన్న కేంద్రాలను బోర్డుకు అప్పగించాలని, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే అక్టోబర్ 14 నుంచి గెజిట్‌ను అమలు చేయనున్నట్లు కేఆర్‌ఎంబీ పేర్కొంది. అయితే, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకోకపోతే తమకు అంగీకారం కాదని ఏపీ సెక్రకటరీ శ్యామలరావు తెలిపారు. శ్రీశైలం, సాగర్‌కు సంబంధించిన అన్ని కేంద్రాలను బోర్డు పరిథిలోకి తీసుకొస్తూ కేఆర్ఎంబీ చేసిన తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలిపారు.

మరోవైపు 65 కేంద్రాలు గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఉన్నాయని, సాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించినట్లు తెలంగాణ ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ వెల్లడించారు. బోర్డు నుంచి ప్రతిపాదనలు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న రజత్ కుమార్ తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్‌నోటిఫికేషన్‌ ఆపాలని కోరినట్లు తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఏపీ కోరగా, తాము అంగీకరించలేదన్నారు. తమకు విద్యుత్‌ ఉత్పత్తి చాలా అవసరమని చెప్పామన్న రజత్ కుమార్ ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయసలహా అడిగినట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories