KP Vivekananda: రేవంత్ రెడ్డి చేసేది జన జాతర కాదు ఓట్ల జాతర

KP Vivekananda: ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం

Jyothi
Published on: 21 April 2024 5:51 PM IST
KP Vivekananda Comments On Revanth Reddy
X

KP Vivekananda: రేవంత్ రెడ్డి చేసేది జన జాతర కాదు ఓట్ల జాతర

KP Vivekananda: సీఎం రేవంత్ రెడ్డి 4 నెలలకే ప్రజా విశ్వాసం కోల్పోయారని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారని ఆయన ఆరోపించారు. రుణమాఫీ చేస్తానని దేవుడిపై ప్రమాణం చేసి ఓట్లు అడగడం అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తొక్కి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారన్నారు.

రేవంత్ రెడ్డి చేసేది జన జాతర కాదు.. ఓట్ల జాతర, కాంగ్రెస్ జాతర అన్నారు ఎమ్మెల్యే వివేకానంద. ప్రజా సమస్యల పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని కాంగ్రెస్ కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కరెంటు తీగ అయితే ఫీజులు ఎగిరిపోతాయని.. ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద.

Jyothi

Jyothi

Next Story