Breaking News: కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌రెడ్డి రాజీనామా

Breaking News: ఈ నెల 16న టీఆర్‌ఎస్‌లో చేరనున్న కౌశిక్‌రెడ్డి * మాణిక్కం ఠాగూర్‌పై కౌశిక్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Sandeep Eggoju
Updated on: 12 July 2021 5:45 PM IST
Koushik Reddy Resigned to Congress Party and going to be join in TRS on This Month 16
X

కౌశిక్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Breaking News: కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 16న టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక.. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కౌశిక్‌రెడ్డి. రేవంత్‌ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించడంలేదని.. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. మాణిక్కం ఠాగూర్‌ ఓ యూజ్‌లెస్‌ ఫెలో అన్న కౌశిక్‌రెడ్డి, ఆయనకు కనీస జ్ఞానం లేదని మండిపడ్డారు. 30ఏళ్లు కాంగ్రస్‌ జెండా మోసినవాళ్లను కాదని, నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్‌కు అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

ఇక.. హుజూరాబాద్‌ ఉపఎన్నిక వ్యవహారంలో రేవంత్‌ తీరు సిగ్గుచేటని అన్నారు కౌశిక్‌రెడ్డి. హుజూరాబాద్‌లో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఉందన్న ఆయన.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలవదని రేవంత్‌ అన్నారని కార్యకర్తలు చెబుతున్నారన్నారు. రేవంత్‌ కన్నా ఉత్తమ్‌ లక్ష పాళ్లు నయమన్నారు. ఈటలకు రేవంత్ అమ్ముడుపోయారన్న కౌశిక్‌రెడ్డి.. రేవంత్‌కు సవాల్‌ విసిరారు. దమ్ముంటే హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను గెలిపించి చూపించాలన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story