Kothagudem: కొత్తగూడెం కార్పొరేషన్‌పై పొలిటికల్‌ హీట్‌

Kothagudem Corporation Mayor Seat Suspense: కొత్తగూడెం కార్పొరేషన్‌పై పొలిటికల్‌ హీట్‌ నెలకొంది.

Arun Chilukuri
Published on: 14 Feb 2026 10:56 AM IST
Kothagudem: కొత్తగూడెం కార్పొరేషన్‌పై పొలిటికల్‌ హీట్‌
X

Kothagudem Corporation Mayor Seat Suspense: కొత్తగూడెం కార్పొరేషన్‌పై పొలిటికల్‌ హీట్‌ నెలకొంది. కాసేపట్లో సీపీఐ ముఖ్యనేతలు జూమ్‌ మీటింగ్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కొత్తగూడెం కార్పొరేషన్‌పై చర్చించనున్నారు. కొత్తగూడెంలో మొత్తం డివిజన్లు 60 కాగా.. కాంగ్రెస్‌-22, సీపీఐ-22, బీఆర్‌ఎస్‌-8, ఇతరులు-6, బీజేపీ-1, సీపీఎం ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. అయితే.. ఏ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కకపోవడంతో.. మేయర్‌ పీఠం కోసం కాంగ్రెస్‌, సీపీఐ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

మరోవైపు.. కొత్తగూడెం మేయర్‌ విష‍యంలో ఏ పార్టీ మద్దతు తీసుకోవాలనేదానిపై సీపీఐ తర్జన భర్జన పడుతోంది. ఇప్పటికే క్యాథన్‌పల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్‌ఎస్‌ పొత్తు విజయం సాధించింది. ఈ క్రమంలోనే సీపీఐకి ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌. సింగరేణిపై పోరాటానికి కలిసి వస్తే సీపీఐకి మద్దతిస్తామంది. దీంతో.. సీపీఐ నేతల జూమ్‌ మీటింగ్‌ పై ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీ తర్వాత పొత్తుల విషయంపై క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story