Kotha Prabhakar Reddy: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి కొత్త ప్రభాకర్ రెడ్డి

Kotha Prabhakar Reddy: కొత్త ప్రభాకర్ ‌రెడ్డితో పాటు హాస్పిటల్‌కు వెళ్లిన మంత్రి హరీష్ రావు

Shekhar G
Published on: 30 Oct 2023 3:27 PM IST
Kotha Prabhakar Reddy Is New To Yashoda Hospital Secunderabad
X

Kotha Prabhakar Reddy: సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి కొత్త ప్రభాకర్ రెడ్డి

Kotha Prabhakar Reddy: కత్తి దాడిలో గాయపడిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. యశోద హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరగ్గా.. ఆయన కడుపులో తీవ్ర గాయమైంది. దీంతో మెరుగైన వైద్యం కోసం యశోద హాస్పిటల్‌కు తరలించారు. కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మంత్రి హరీష్ రావు కూడా ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు.

సిద్దిపేట జిల్లా సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడిచేశాడు ఓ అగంతకుడు. కత్తితో దాడిలో ప్రభాకర్ రెడ్డికి తీవ్రగాయాలు కాగా.. అతడిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్ తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story