Konijeti Rosaiah: నేడు మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు

Konijeti Rosaiah: మధ్యాహ్నం ఒంటి గంటకు రోశయ్య అంత్యక్రియలు...

Shireesha
Published on: 5 Dec 2021 7:38 AM IST
Konijeti Rosaiah Funeral Today at Kompally Devaryamjal Farmhouse | Telugu Online News
X

Konijeti Rosaiah: నేడు మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు

Konijeti Rosaiah: అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. రోశయ్య పార్థివదేహాన్ని అమీర్‌పేటలోని ఆయన నివాసం నుంచి ఇవాళ ఉదయం గాంధీభవన్‌కు భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు.

మధ్యాహ్నం 12.30 తర్వాత గాంధీభవన్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు రోశయ్య అంత్యక్రియలు కొంపల్లి దేవరయంజాల్ ఫాం హౌస్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణాన్ని ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న రోశయ్యను.. ఎన్నో పదవులు వరించాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రాజకీయాలకు అతీతంగా రోశయ్య మరణంపై ప్రముఖుల సంతాపం వెల్లువెత్తుతోంది.

Shireesha

Shireesha

Next Story