Konda Vishweshwar Reddy: బొటానికల్ గార్డెన్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి సందడి

Konda Vishweshwar Reddy: ధర్మపరిరక్షణ కోసం మోడీని మరోసారి ప్రధానిని చేయాలి

Jyothi
Published on: 21 April 2024 3:51 PM IST
Konda Vishweshwar Reddy Sandadi in the Botanical Garden
X

Konda Vishweshwar Reddy: బొటానికల్ గార్డెన్‌లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి సందడి 

Konda Vishweshwar Reddy: చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శేర్లింగంపల్లిలోని బొటానికల్ గార్డెన్‌లో సందడి చేశారు. వాకర్స్‌తో కలిసి వాకింగ్ చేశారు. స్థానిక యువకులతో కలిసి విన్యాసాలు చేశారు.‌ కరాటే నేర్చుకుంటున్న చిన్నారులతో కలిసి ఆటలాడారు. దేశ హితం కోసం నరేంద్ర మోడీ చేపట్టిన సాహసోపేతమైన నిర్ణయాలను వివరించారు. ధర్మ పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని చేయాలని కోరారు.

మే 13న స్వచ్ఛందంగా తరలివచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి విన్నవించారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంపై ఆయన వారికి అవగాహన కల్పించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంట శేర్ లింగంపల్లి రవికుమార్ యాదవ్, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story