Konda couple re active in politics: కొండా దంపతులు రీ - యాక్టీవ్ కాబోతున్నారా?

Konda couple re active in politics: కొండా దంపతులు రీ - యాక్టీవ్ కాబోతున్నారా?
x
Highlights

Konda couple re active in politics:: రాజకీయాల్లో హత్యలుంటాయో లేక ఆత్మహత్యలుంటాయో తెలియదు కాని, రాజకీయాలనే నమ్ముకున్న ఓ పొలిటికల్ ఫ్యామిలీ, క్రాస్‌రోడ్స్‌లో నిలబడింది.

Konda couple re active in politics:: రాజకీయాల్లో హత్యలుంటాయో లేక ఆత్మహత్యలుంటాయో తెలియదు కాని, రాజకీయాలనే నమ్ముకున్న ఓ పొలిటికల్ ఫ్యామిలీ, క్రాస్‌రోడ్స్‌లో నిలబడింది. లేటుగానైనా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తోందట. సదరు పొలిటికల్ స్టార్స్ మేల్కొనేసరికి, కాంపిటీషన్ పెరుగుతోందట. ఇక లాభం లేదనుకున్న ఆ లీడర్ కపుల్, రాజకీయ గమ్యాన్ని, గమనాన్ని మార్చుకోవాలని డిసైడ్ అయ్యారట. పూలమ్మిన చోటే కట్టెలమ్ముతున్న ఆ నేతలిప్పుడు పూర్వ వైభవం కోసం తహతహలాడిపోతున్నారట. ద టైం విల్ కమ్ అనే స్లోగన్ తో పావులు కదుపుతున్నారట. ఇంట్రస్టింగ్ గా ఉంది కదూ లెటస్ వాచ్ దిస్ ఆప్ ది రికార్డ్.

కొండా కపుల్.. ఫైర్‌బ్రాండ్‌ కపుల్...కొండా సురేఖ దంపతులంటే, తెలియనివారుండరు తూటాల్లాంటి వారి మాట, మంటల దారిని తలపించే వారి బాట ఓరుగల్లు కోటలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ యమ ఫేమస్ కపుల్. అదంతా నాడు, మరి నేడేంటి? ఆ ప్రశ్నకు బదులిచ్చేపనిలోనే యాక్టివ్‌ అవుతున్నారట కొండా కపుల్.

తెలంగాణ రాజకీయాల్లో ఓరుగల్లు జిల్లాది ఓ ప్రత్యేక స్థానం. అందులో కొండా సురేఖ దంపతుల ప్రస్థానం మరింత ప్రత్యేకం. కాంగ్రెస్ పార్టీ, అందునా వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనైనా, వారిది స్వర్ణ యుగం. జిల్లాలో వీరు చెప్పిందే వేదం. వీరు చేసింది శాసనం. వైఎస్సార్ మీద అభిమానాన్ని చాటుకుని ముందుగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత మారిన రాజకీయాలకనుగుణంగా గులాబీ తీర్థం పుచ్చుకుని నియోజకవర్గం మారి మరీ, సత్తా నిరూపించుకున్నారు.

అది గత చరిత్ర వీరీ మోనోపలిజానికి గులాబీ పార్టీలో అధినేతకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 2018 ఎన్నికల్లో, ఫస్ట్ ఫేజ్‌లో టికెట్ ఆపారు. నేరుగా సిఎం వీరితో చర్చించి బీఫాం ఇద్దామని భావిస్తున్న తరుణంలోనే, ఘర్‌ వాపసీ అంటూ కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకుని, గులాబీ దండుపై విమర్శల జడివాన కురిపించారు. కాంగ్రెస్‌ తరపున పరకాలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి, బలవంతపు నిశ్శబ్దంలో వున్నారు. ఇటు పరకాలకు కూడా దూరంగా ఉంటున్న దంపతులు, ఇక ఇలాగే మౌనమే జీవితమైతే, గతకాలపు వైభవమంతా, గతమే అవుతుందనుకున్న కొండా కపుల్, యాక్టివ్‌ పాలిటిక్స్‌ వైపు మళ్లీ ఫేస్‌ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారట. పరకాలకు దూరమే కాదు, దీనికి తోడు కొండా దంపతుల చిరకాల రాజకీయ ప్రత్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావుకు, మంత్రి పదవి ఇవ్వడంతో ఎటూ జీర్ణించుకోలేకపోతున్నారట. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న కొండా దంపతులు, ఇక లాభం లేదనుకుని, మళ్ళీ యాక్టివ్ అయ్యారట. కార్యకర్తలకు కొండంత అండగా ఉంటాం అంటూ పార్టీశ్రేణులకు భరోసా ఇస్తున్నారట. అజ్ఞాతం వీడి జనం మధ్యలో హడావుడి చేస్తున్నారట కొండా కపుల్.

కొండా దంపతుల యాక్టివ్‌ ఓకే, మరి వీరిలో ఎవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు...? వీరిని నమ్ముకున్న వారికి ఎలా అండగా నిలుస్తారనే ప్రశ్నలు తాజాగా మొదలయ్యాయి. గతంలో అడ్డాగా ఉన్న పరకాల నియోజకవర్గాన్ని వీడి వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, భూపాలపల్లి నుంచి కొండా మురళీధర్ రావు బరిలోకి దిగుతారన్న మాటలు వినిపించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కాంగ్రెస్ జిల్లా ఇంఛార్జిగా కొండా మురళీధర్ రావు ఇప్పటికే బాధ్యతలు సైతం తీసుకున్నారని చర్చ సాగుతోంది. ఈ రెండు చోట్లా బరిలోకి దిగే స్కెచ్ వేసుకుని మరీ తిరుగుతున్నారని జిల్లాలో టాక్. ఇదిలావుంటే, వీరిద్దరు సరే, మరి కూతురి సీటెక్కడ అని అడుగుతున్నారట కొండా అనుచరులు.

అయితే ఓసారి పరకాల, ఇంకోసారి భూపాలపల్లి, మరోసారి వరంగల్ తూర్పు అని నిలకడలేని మాటలతో కొండాకు రాజకీయ సలహాలు ఇచ్చారట కొందరు. రెండు పడవలపై కాలు పెడితే అసలుకే ఎసరని బోధపడ్డంతో, ఇప్పుడు వరంగల్ తూర్పుపైనే చాలా సీరియస్‌గా ఉన్నారట. అందుకే తూర్పు నియోజకవర్గంలో సెల్ఫీలతో సందడిచేస్తున్నారట. 24 గంటలు తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ప్రకటించారట. త్వరలో రాబోతున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ దమ్ము చూపిస్తామంటున్నారట. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో, 23 డివిజన్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారట కొండా కపుల్.

మొత్తమ్మీద, ఇంతకాలం మౌనంగా ఉన్న కొండా దంపతులు, ఇప్పుడు తమ సీట్లు రిజర్వేషన్ చేసుకునే పనిలో పడ్డారని అర్థమవుతోంది. ఇదంతా సరే, మరి వీరి రాజకీయ వారసురాలిని కూడా అసెంబ్లీ బరిలో దింపాలని తొలుత భావించినా, ఇప్పుడు రాజకీయ పరిస్థితులను అనుకూలంగా, గ్రేటర్ వరంగల్ ఎన్నికల బరిలో కార్పొరేటర్‌గా దించి, అన్నీ అనుకూలిస్తే మేయర్ స్థానం కైవసం చేసుకోవాలని భావిటున్నారట. మేయర్ రిజర్వేషన్ బీసీ జనరల్ కావడంతో కలిసి వస్తుందని మాట్లాడుకుంటున్నారట కొండా దంపతులు.

జిల్లాలో చక్రం తిప్పిన కొండా దంపతులకు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. విపత్కర పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకొనే నైజం ఉన్న దంపతులకు, పరకాలను వీడి పట్నంలోని తూర్పుకి యూటర్న్ తీసుకొని రావడం, రాజకీయంగా ఏ మేరకు ఫలిస్తుందో, దీటుగా వున్న గులాబీ ప్రత్యర్థులను వీరు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.



Show Full Article
Print Article
Next Story
More Stories