Siddipet: ఘనంగా ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

Siddipet: ఇవాళ కొమురవెల్లి మల్లన్న పట్నం వారం

Dhatripriya
Updated on: 22 Jan 2023 7:30 PM IST
Komuravelli Mallanna Brahmotsavam Started
X

Siddipet: ఘనంగా ప్రారంభమైన కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

Siddipet: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం ప్రారంభమయ్యే జాతర తొమ్మిది వారాలపాటు కొనసాగనుంది. మొదటి ఆదివారాన్ని పట్నం వారం అంటారు. పట్నం ఆదివారాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ కు చెందిన భక్తులు పెద్ద ఎత్తున మల్లన్నను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మల్లన్నకు బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మల్లన్న ఆలయ గుట్టపై ఉన్న ఎల్లమ్మకు భక్తులు బోనాలు నివేదించారు.

Dhatripriya

Dhatripriya

Next Story