సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ

Komatireddy Venkat Reddy Writes Letter To Sonia Gandhi
x

సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ 

Highlights

Congress: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో టెన్ జన్ పథ్ లోని సోనియాగాంధీ నివాసంలో సమావేశమయ్యారు.

Congress: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో టెన్ జన్ పథ్ లోని సోనియాగాంధీ నివాసంలో సమావేశమయ్యారు. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ సమక్షంలో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ నేతలు మునుగోడు ఉపఎన్నికపై చర్చించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకాలేదు.

మరో వైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి తనను అవమానపరుస్తున్నందునే సమావేశానికి హాజరు కాలేదంటూ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఎలాంటి సమాచారం లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తూ తన అనుచరలతో అవమానకరంగా మాట్లాడిస్తున్నారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే తాను ప్రియాంకగాంధీతో సమావేశానికి హాజరుకాలేకపోయినట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories