Komatireddy Venkat Reddy: నన్ను పార్టీలో నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు..

Komatireddy Venkat Reddy: పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు.

Arun Chilukuri
Updated on: 5 Aug 2022 6:46 PM IST
Komatireddy Venkat Reddy Slams Revanth Reddy
X

Komatireddy Venkat Reddy: నన్ను పార్టీలో నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. 

Komatireddy Venkat Reddy: పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైరయ్యారు. మూడేళ్ల క్రితం వచ్చిన వారికి పీసీసీ పదవా అంటూ ప్రశ్నించారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి...తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నానని గుర్తు చేశారు. ప్రాణం పోయినా కాంగ్రెస్‌ను వీడనన్న ఆయన ఏడుసార్లు ఓడిపోయిన షబ్బీర్‌ అలీని, పండు ముసలోళ్లను వెంటేసుకుని పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో నాన్‌లోకల్‌ అభ్యర్థిని చివరి క్షణంలో డిసైడ్‌ చేశారని పాత కాంగ్రెస్‌ నేతలను పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story