Komatireddy: రేవంత్‌ క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్‌.. అద్దంకి దయాకర్‌ను శాశ్వతంగా బహిష్కరించాలి..

Komatireddy Venkat Reddy: రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడం సంతోషమేనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

Arun Chilukuri
Updated on: 13 Aug 2022 2:34 PM IST
Komatireddy Venkat Reddy Responds on Revanth Reddy Comments
X

Komatireddy: రేవంత్‌ క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్‌.. అద్దంకి దయాకర్‌ను శాశ్వతంగా బహిష్కరించాలి..

Komatireddy Venkat Reddy: రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడం సంతోషమేనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ఉద్యమకారుడ్ని అయిన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దంకి దయాకర్‌ను శాశ్వతంగా బహిష్కిరించాలని డిమాండ్ చేశారు. అద్దంకిపై చర్యలు తీసుకున్నాకే.. ప్రచారంపై ఆలోచిస్తానని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ మీడియా ద్వారానే తెలిసిందన్నారు వెంకట్‌రెడ్డి.

ఇదిలా ఉంటే అద్దంకి దయాకర్‌ శనివారం మరోసారి ఎంపీ కోమటిరెడ్డికి క్షమాపణలు తెలిపారు. ఈ సందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ.. 'పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. క్రమశిక్షణ కమిటీ నాకు షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. నోటీసులకు వివరణ ఇచ్చా.. క్షమాపణ కూడా చెప్పా. భవిష్యత్‌లో మరోసారి అలా జరగకుండా చూసుకుంటాను' అని అద్దంకి దయాకర్‌ పేర్కొన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story