Komatireddy Venkat Reddy: ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారు

Komatireddy Venkat Reddy: అదానీ గురించి రాహుల్ మాట్లాడినప్పటి నుంచి కుట్ర పన్నారు

Dhatripriya
Updated on: 26 March 2023 2:02 PM IST
Komatireddy Venkat Reddy Reacted On Rahul Gandhi Case
X

Komatireddy Venkat Reddy: ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా వదులుకున్నారు

Komatireddy Venkat Reddy: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం తనను కంటతడి పెట్టించిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గాంధీభవన్ వద్ద దీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీకి వచ్చినా వదులుకున్నారని పేర్కొన్నారు. అదానీ గురించి పార్లమెంట్‌‌లో రాహుల్ మాట్లాడినప్పటి నుంచి కుట్ర పన్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. అదానీ గురించి రాహుల్ మాట్లాడతారనే బీజేపీలో భయం ఉందని, దీంతోనే పరువునష్టం కేసులో శిక్ష పడేలా చేశారని ఆ‍యన ఆరోపించారు. అవసరమయితే కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్‌పై అనర్హత వేటు ఎత్తేసే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారాయన... ఇంధిరాగాంధీపై వేటు వేస్తే ఏం జరిగిందో.. ఇప్పుడు అదే జరుగుతుందని కోమటి రెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.

Dhatripriya

Dhatripriya

Next Story