ఎంపీ కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

Komatireddy Venkat Reddy Comments On Revanth Reddy
x

ఎంపీ కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

Highlights

Komatireddy Venkat Reddy: రేవంత్‌రెడ్డి వల్లే తెలంగాణ కాంగ్రెస్ నాశనమైందని వ్యాఖ్యలు

Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి వర్సెస్ ఇతర నాయకుల రచ్చ రోజురోజుకు ముదురుతోంది. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ తీరుపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోనియాకు ఓ లేఖ రాశారు. రేవంత్‌రెడ్డి తనను అవమాన పరుస్తున్నారంటూ లేఖలో ప్రస్తావించారు. తన నియోజకవర్గంలో ఎలాంటి సమాచారం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పార్టీ పగ్గాలు కమల్‌నాథ్ వంటి సీనియర్లకు అప్పగించాలన్నారు. అలాగే ప్రియాంకగాంధీతో సమావేశానికి హాజరుకాకపోవడంపై లేఖ ద్వారా వివరణ ఇచ్చారు ఎంపీ కోమటిరెడ్డి.

రేవంత్‌రెడ్డి తీరు సీనియర్ నాయకులను అవమానించేలా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. చండూరు సభ, పార్టీలో చెరుకు సుధాకర్ చేరిక లాంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు.

ఇక తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను లేఖలో పేర్కొన్నారు. రేవంత్‌తో వేదిక పంచుకోలేనంటూ సోనియాకు వివరణ ఇచ్చిన వెంకట్‌రెడ్డి.. దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో తాను పనిచేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సీనియర్‌ నేతలను రేవంత్​హోంగార్డులతో పోల్చడంపై ఆందోళన వ్యక్తం చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories