Komatireddy: టికెట్ల విషయంలో నేను జోక్యం చేసుకోను.. కేసీఆర్ చేసిన పాపాల వల్లే కరువు వచ్చింది

Komatireddy: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పని అయిపోంది

Shashank Gullapelli
Published on: 29 March 2024 1:34 PM IST
Komatireddy Venkat Reddy Chit Chat With Media
X

Komatireddy : టికెట్ల విషయంలో నేను జోక్యం చేసుకోను.. కేసీఆర్ చేసిన పాపాల వల్లే కరువు వచ్చింది

Komatireddy: పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపుకోసం పని చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన కోమటిరెడ్డి తెలంగాణ కోసం తప్ప ఎప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదన్నారు. టికెట్ల విషయంలో జోక్యం చేసుకోనని.. పార్టీలో సీనియర్లకు ఎవరికీ అన్యాయ జరగదన్నారు. కేసీఆర్ చేసిన పాపాల వల్లే కరవు వచ్చిందని కోమటిరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం పేరుతో అడ్డంగా దోచుకున్నారని... ఏ ముఖం పెట్టుకొని నల్లగొండ జిల్లా పర్యటనకు వస్తారని ప్రశ్నించారు.

అధికారం పోయే సరికి కేసీఆర్ కుటుంబం తట్టుకోలేకపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్పుకుంటున్నారని అన్నారు. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెగ్యులర్ గా మాట్లాడతున్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్-బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని చెప్పారు. యాదగిరిగుట్టలో స్కాం జరగిందని.. ఎన్నికల తర్వాత విచారణకు ఆదేశిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఆ రాష్ట్రంలో చూడలేదని.. కేసీఆర్ ప్రతిదీ రాజకీయం చేశారని ఆరోపించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story