Rajgopal Reddy: రుజువు చేస్తే రాజకీయ సన్యాసం.. లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా..

Rajgopal Reddy: మంత్రి జగదీశ్వర్ రెడ్డి తనపై నిరాదారణమైన ఆరోపణలు చేస్తున్నాడన్నారు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Arun Chilukuri
Published on: 15 Aug 2022 5:53 PM IST
Komatireddy Rajgopal Reddy Open Challenge to Minister Jagadish Reddy
X

Rajgopal Reddy: రుజువు చేస్తే రాజకీయ సన్యాసం.. లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా..

Rajgopal Reddy: మంత్రి జగదీశ్వర్ రెడ్డి తనపై నిరాదారణమైన ఆరోపణలు చేస్తున్నాడన్నారు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి జగదీశ్వర్ రెడ్డినే అసలైన అక్రమార్కుడని ఆరోపించాడు. తనపై కాంట్రాక్టు ఆరోపణలను రుజువు చేయాలన్నారు. రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నేరచరిత్ర కలిగిన జగదీష్ రెడ్డి జిల్లాకు మంత్రి అయ్యాడని, నాగారం, తుంగతుర్తిలో మర్డర్ కేసులో ఆయన A1, A2 నిందితుడిగా ఉన్నాడంటూ రాజగోపాల్ రెడ్డి అరోపించారు. తెలంగాణ విభజనకు ముందు జగదీష్ రెడ్డికున్న ఆస్తులెన్ని? ఇప్పుడున్న ఆస్తుల లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మొత్తం జగదీశ్ రెడ్డి బండారాన్ని బయట పెడతానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story