అసెంబ్లీలో మంత్రి తలసాని వర్సెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Assembly: అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

Arun Chilukuri
Published on: 14 March 2022 4:30 PM IST
Komatireddy Rajagopal Reddy Vs Talasani Srinivas Yadav Fight In Assembly
X

అసెంబ్లీలో మంత్రి తలసాని వర్సెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Assembly: అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సభలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చ జరిగే సమయంలో ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కోమటి రెడ్డి ఒక కాంట్రాక్టర్ అని తలసాని అనడంతో కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కాంట్రాక్టర్ అయితే పేకాడే వ్యక్తి మంత్రిగా ఉండొచ్చా అధ్యక్షా అని కోమటిరెడ్డి సమాధానం ఇవ్వడంతో అధికార పార్టీ సభ్యులు కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డారు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన కోమటి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కోమటి రెడ్డి సభకు క్షమాపణ చెప్పాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story