ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
Munugode Election Results 2022: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం దాదాపు ఖరారవడంతో.. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక, మునుగోడులో బీజేపీకి ఊహించని ఓటమి ఎదురుకానుంది. మరోవైపు, ఎన్నికల ఫలితాల సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. 'టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. కనీసం ప్రచారం కూడా చేసుకోనివ్వలేదు. కేసీఆర్, కేటీఆర్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇది టీఆర్‌ఎస్ అధర్మ గెలుపు. అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘించింది. పోలీసు వ్యవస్థను టీఆర్‌ఎస్ తన సొంతానికి వాడుకొంది. మునుగోడులో నైతికంగా విజయం నాదే'' అని అన్నారు.
Next Story